Easy veg sandwich

Easy veg sandwich recipe in Telugu – బ్రెడ్ సాండ్విచ్ రెసిపీ

 

కావలసిన పదార్థాలు
  •     బట్టర్ – 2 టేబుల్ స్పూన్
  •     బ్రెడ్ ముక్కలు – 3
  •     ఉల్లిపాయలు
  •     టమోటా
  •     క్యారట్
  •     క్యాప్సికం
  •     టమోటా కెచ్అప్
  •     సోయా సాస్
  •     రెడ్ చిల్లీ సాస్
  •     ఉప్పు
  •     రెడ్ చిల్లీ పౌడర్
  •     పెప్పర్ పౌడర్
  •     మ్యాంగో పౌడర్
  •     కొత్తిమీర
  •     మోజెరెల్ల చీస్
  •     పసుపు పొడి

తయారీ విధానం

  •     స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 2 టీ స్పూన్ల బట్టర్ ని వేసుకొని బట్టర్ ని కరిగించుకోవాలి.
  •     బట్టర్ కరిగిన తరువాత అందులో 2 తురిమిన ఉల్లిపాయలు, 2 తురిమిన క్యాప్సికం, 1 తురిమిన క్యారట్, చిన్నగా తరిగిన 2 పచ్చి మిర్చీలు వేసి 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలి.
  •     వేసుకున్న కూరగాయలు బాగా ఫ్రై అయిన తరువాత అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మ్యాంగో పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  •     ఆ తరువాత 2 తరిగిన టమోటాలు వేసి 2 నిమిషాలు కుక్ చేయాలి.
  •     టమోటాలు బాగా ఉడికిన తరువాత అందులో 1 టీ స్పూన్ టమోటా కెచ్అప్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
  •     చివరిగా అందులో రెడ్ చిల్లీ పౌడర్, కొంత కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని 4 క్యూబ్స్ మోజెరెల్ల చీస్ ని వేసి చీస్ కరిగే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  •     దానిపై కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  •     ఇప్పుడు బ్రెడ్ ముక్కల యొక్క సైడ్స్ ని ట్రిమ్ చేసి, తయారు చేసుకున్న స్టఫ్ ని రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి.
  •     ఇప్పుడు ఒక ప్యాన్ పై బట్టర్ రాసి సాండ్విచ్ యొక్క రెండు వైపులూ ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి బ్రెడ్ సాండ్విచ్ రెడీ!

Comments